ఒమిక్రాన్ ను డోంట్ కేర్ అంటున్న కువైటీలు...ప్రయాణాలకే మొగ్గు

- December 10, 2021 , by Maagulf
ఒమిక్రాన్ ను డోంట్ కేర్ అంటున్న కువైటీలు...ప్రయాణాలకే మొగ్గు

కువైట్: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలు క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కోసం ప్రయాణ ప్రణాళికలను వేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతృప్తిగా ఉన్న ప్రజలు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. కొత్త వేరియంట్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణ పరిమితులను సడలించింది. ఫెడరేషన్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీసుల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మహమ్మద్ అల్-ముతైరీ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కోసం ప్రయాణ రిజర్వేషన్లు పెరిగాయన్నారు. లండన్, టర్కీ, రియాద్, జెద్దా, దుబాయ్‌లకు వెళ్లేందుకు కువైటీలు ఎక్కువగా ఇష్టపడతారని, ఆ రూట్లలోనే ఎక్కువగా రిజర్వేషన్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com