ఏపీ కరోనా అప్డేట్

- December 10, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,793 శాంపిల్స్‌ పరీక్షించగా..142 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,15,406 కు చేరుకోగా…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,552 కు పెరిగింది.ఇక, 20,58,101 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,462 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,989 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com