హైదరాబాద్‌లో మెగా జాబ్ ఫెయిర్...
- December 13, 2021
హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌లో 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, బీఈ, బీటెక్, డిగ్రీ/పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు సూచించారు.
జాబ్ ఫెయిర్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, నిపుణ వెబ్సైట్ http://www. nipunahds.com ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు తెలిపారు.మరిన్ని వివరాలకు 9848484264, 8790006745 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఈ క్రింద ఫామ్ నింపండి.
https://forms.gle/Nsi1rsPLMNamQRYu5
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









