దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్

- December 13, 2021 , by Maagulf
దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్

మస్కట్: వాహనాల్లోని డబ్బును దొంగతనం చేస్తున్నారన్న ఆరోపణలపై ఎనిమిది మంది సభ్యులు గల ఆఫ్రికన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసే కస్టమర్లను ఈ ముఠా టార్గెట్ చేస్తారని, వారి దృష్టిని మరల్చి వారి వాహనాల్లోంచి డబ్బును ముఠా కాజేస్తారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com