పింగళి వెంకయ్య కుమార్తె కు TANA ఘన సత్కారం
- December 13, 2021
ఏపీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గుంటూరు జిల్లా మాచర్ల లో నివాసముంటున్న భారతదేశ త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ ని తానా సంస్థ తరపున జ్ఞాపిక, దుశ్శాలువా, పూలమాల, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి, పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సంధర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ... “ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులందరూ మన త్రివర్ణ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించి, భారత దేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను “అజాదీ కా అమృత మహోత్సవ్” పేరుతో ఘనంగా జరుపుకోవదానికి సమాయత్తమైవుతున్న ఈ తరుణంలో, భారత జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన తెలుగువారి కీర్తిని దసదిశలా వ్యాప్తిజేసిన ఆ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 100 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ( డిసెంబర్ 14) వారి కుమార్తె సీతామహాలక్ష్మీ ని ప్రత్యక్షంగా కలుసుకుని ఆమెను సత్కరించుకోవడం నా జీవితంలో ఒక అరుదైన అవకాశం, అదృష్టం, దీంతో మా తానా సంస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసుకున్నట్లయ్యంది” అని ప్రకటించారు.
“తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి స్వయంగా మాచర్ల వచ్చి మా నాన్న పింగళి వెంకయ్య కు నివాళులర్పించి, నన్ను సత్కరించి వారి ప్రేమాభిమానాలను చూపడం, నాకు జరిగిన ఈ సన్మానం నా తండ్రికి జరిగినట్లుగా భావిస్తున్నానని, మా కుటుంబం తరపున చౌదరి కు మరియు తానా సభ్యులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు సీతామహాలక్ష్మీ.
సీతామహాలక్ష్మీ అంజయ్య చౌదరిని దుశ్శాలువ తో సత్కరించి తన కుమారుడు జి.వి.యన్. నరసింహం వ్రాసిన “ పింగళి వెంకయ్య జీవిత చరిత్ర” పుస్తకాన్ని బహూకరించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో తానా బోర్డు సభ్యులు జనార్ధన్ నిమ్మలపూడి, పింగళి వెంకయ్య మనుమడు జి.వి.యన్. నరసింహం వారి కుటుంబ సభ్యులు, మాచర్ల లోని మీనాక్షి కంటి ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల కృష్ణయ్య వారి బృందం పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







