వాట్సాప్ వేదికగా నయా మోసాలు..
- December 13, 2021
‘అత్యవసరం’ పేరుతో దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు.సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. వాట్సాప్‌లో ‘ప్రెండ్ ఇన్ నీడ్’ పేరుతో నయా దందా మొదలుపెట్టారు.
స్నేహితులు పంపుతున్నట్లు యూజర్‌కు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపుతారట.ఫోన్ పొగొట్టుకున్నానని, వేరే నంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నానని చెబుతూ యూజర్స్‌ను నమ్మించి వారి నుంచి నగదు బదిలీ చేయిస్తున్నట్లు గుర్తించామని బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
అలానే కొన్ని సందర్భాల్లో అత్యవసరంలో ఉన్నామని, డబ్బులు కావాలని తల్లిదండ్రులను పిల్లలు అడుగుతున్నట్లుగా మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.
ఒకవేళ యూజర్స్ మొదటి మెసేజ్‌కు స్పందిచకపోతే వేర్వేరు నంబర్ల నుంచి వరుస మెసేజ్‌లు పంపి ఏమార్చుతున్నారని వాట్సాప్ పేర్కొంది.
ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా బ్రిటన్‌లో జరుగుతున్నాయని ఒక నివేదికలో తెలిపింది.ఒకవేళ యూజర్స్‌కు తమకు తెలియని నంబర్ల నుంచి డబ్బులు కావాలని మెసేజ్‌లు వచ్చినా.. నంబర్లపై అనుమానం కలిగినా వెంటనే వాట్సాప్‌కు రిపోర్ట్ చేయాలని సూచించింది.
భారత్‌లోనూ ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉన్నందున యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.
వాట్సాప్‌కు ఎలా రిపోర్ట్ చేయాలంటే?
మీకు తెలియని లేదా అనుమానం ఉన్న నంబరు నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత చాట్ పేజ్ పైభాగంలో కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. మోర్ (more) అనే ఆప్షన్ వస్తుంది అందులో రిపోర్ట్ (Report) అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు కాంటాక్ట్ గురించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేయమంటారా? అని అడుగుతూ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
అందులో రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఎందుకు దానిపై ఫిర్యాదు చేశారో తెలపాలంటూ వాట్సాప్ మిమ్మల్ని అడుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలు వాట్సాప్‌కు సమర్పిస్తే, విచారించి చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!