ప్రవాసుల కార్ల సంఖ్యపై నియంత్రణ.. ఎంపీ ప్రతిపాదన
- December 14, 2021
కువైట్: దేశంలో ట్రాఫిక్ రద్దీని, ప్రమాదాలను నివారించేందుకు ప్రవాసుల పేరు మీద ఉండే కార్ల సంఖ్యను పరిమితం చేయనున్నారు.ఈ మేరకు పార్లమెంటేరియన్ డాక్టర్ అబ్దుల్లా అల్-తారిజీ ప్రతిపాదనను సమర్పించారు. దీని ప్రకారం.. ప్రవాసులు తన వినియోగానికి రెండు కార్లు మాత్రమే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతకుమించిన ప్రతి వాహనంపై అదనపు ఫీ విధించాలని ఆయన తన ప్రతిపాదనలో కోరారు. దేశంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాత వాహనాలు కొని తిరుగుతున్నారని, దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం తో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. అలాగే పబ్లిక్ గ్రౌండ్స్, స్కూల్స్ పార్కింగ్ స్థలాలు, మసీదులు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ కష్టాలు ఎదురవుతున్నాయని ఎంపీ డాక్టర్ అబ్దుల్లా అల్-తారిజీ తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. కొంతమంది ప్రవాసులు తమ పేరు మీద 50 వరకు కార్లను కలిగి ఉన్నారని వార్తలు వచ్చిన విషయాన్ని కూడా అతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!







