మోటరైజ్డ్ పారాప్లేన్‌లో ప్రిన్స్ షేక్ హమ్దాన్...

- December 14, 2021 , by Maagulf
మోటరైజ్డ్ పారాప్లేన్‌లో ప్రిన్స్ షేక్ హమ్దాన్...

యూఏఈ: దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో తన పైలటింగ్ నైపుణ్యంతో మోటరైజ్డ్ పారాప్లేన్‌ లో ఎగురుతున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ వీడియోలో పారా ప్లేన్ లో  సూచనలు, సలహాలు ఇస్తూ కన్పించారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన అరగంటలో వైరల్ అయ్యింది. ప్రిన్స్ షేక్ హమ్దాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు 12.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే లక్షలాది మంది చూస్తుంటారు.  2019 జూలైలోనూ  షేక్ హమ్దాన్ పచ్చిక బయళ్లు, పర్వతాలపై హెలికాప్టర్‌ లో ఎగురుతున్న వీడియోను షేర్ చేశారు. అది కూడా వైరల్ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com