GCC సమ్మిట్‌.. UAE బృందానికి షేక్ మహమ్మద్ నాయకత్వం

- December 14, 2021 , by Maagulf
GCC సమ్మిట్‌.. UAE బృందానికి షేక్ మహమ్మద్ నాయకత్వం

సౌదీ: సౌదీ అరేబియాలో జరిగే GCC నాయకుల 42వ శిఖరాగ్ర సమావేశానికి UAE ప్రతినిధి బృందానికి UAE ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు  షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వం వహించనున్నారు. యూఏఈ భద్రత, జీసీసీ ఐక్యత అజెండాలోని ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంటుందని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు.  కస్టోడియన్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన డిసెంబర్ 14న ప్రారంభం కానున్న GCC 42వ సెషన్‌కు సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తోంది. గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, విద్యా, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధిని, పురోగతిని చర్చించడానికి ఏటా జీసీసీ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com