హీరో మహేష్ బాబుకు సర్జరీ..దుబాయ్ లో విశ్రాంతి
- December 14, 2021
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం దుబాయ్‌లో మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసినది. మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టు సమాచారం.
తీవ్ర నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరం అని సలహా ఇవ్వడంతో స్పెయిన్ వెళ్లి మోకాలికీ సర్జరీ చేయించుకున్నారు సూపర్ స్టార్ మహేష్. సర్జరీ తరువాత దుబ్బాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం. విశ్రాంతి ముగించుకుని కోలుకున్న తరువాత ఫిబ్రవరి నుంచి షూటింగ్‌లో పాల్గనున్నట్టు సమాచారం. మొత్తానికి మహేష్ బాబు దీర్ఘకాలంగా బాధపడుతున్న మోకాలి నొప్పికి సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









