భారత్‌లో 61కి చేరిన ఒమిక్రాన్ కేసులు
- December 14, 2021
న్యూ ఢిల్లీ: గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదువుతున్నాయి. అయితే తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కు చేరింది. భారత్‌లో ఒమిక్రాన్ ప్రభావం మహారాష్ట్రపై ఎక్కవగా కనిపిస్తోంది. రోజురోజుకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ రోజు మరో 8 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదవడంతో.. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం గత శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలులో పెట్టింది. అంతేకాకుండా ఒమిక్రాన్ సోకిన వ్యక్తలు కాంటాక్టులను కూడా వీలైనంత త్వరగా గుర్తించి టెస్టింగ్‌లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి