జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం : అమరుడైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
- December 15, 2021
న్యూఢిల్లీ : తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది. ఈ వివరాలను ఐఏఎఫ్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్లో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది.
డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో బెంగళూరులో చికిత్స పొందారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







