లేబర్ చట్టాలను ఉల్లంఘించే సంస్థలకు పెనాల్టీ...
- December 19, 2021
సౌదీ అరేబియా: సౌదీలో పనిచేసే కార్మికులకు గుడ్ న్యూస్. లేబర్ వర్క్ పెనాల్టీ చట్టాన్ని సౌదీ ప్రభుత్వం ఆమోదించింది.దీంతో పనిచేసే చోట కార్మికులకు సరైన భద్రత, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టని సంస్థలకు భారీగా ఫైన్ విధించనున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి (MHRSD) అహ్మద్ అల్-రాజి వెల్లడించారు.ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నిబంధనలను మూడు కేటగిరీలుగా విభజించారు. తొలి కేటగిరీగా 51 మంది ఉద్యోగులతో కూడిన సంస్థలు,రెండవ దాంట్లో 11 నుండి 50 మంది వరకు ఎంప్లాయిస్, మూడో కేటగిరీ కింద కనీసం 10 మంది ఉద్యోగులతో కూడిన సంస్థలను చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం నిర్దేశించిన రక్షణ, భద్రత, ఆరోగ్య సంరక్షణ చర్యలను కంపెనీ మేనేజ్మెంట్ పాటించడంలో విఫలమైతే భారీగా ఫైన్ విధిస్తారు.మొదటి కేటగిరీ కంపెనీలకైతే 10,000 రియాల్,రెండవ గ్రూప్ కంపెనీలకు 5,000 రియాలు, మూడో కేటగిరీ లో ఉన్న కంపెనీలకు 2,500 రియాల్ ఫైన్ వేస్తారు. కోఆపరేటివ్ హెల్త్ లా ప్రకారం...ఎంప్లాయికి, అతని కుటుంబ సభ్యులకు మెడికల్ బీమాను అందించకపోతే కేటగిరీని బట్టి కంపెనీలకు 10,000-3,000 వరకు ఫైన్ విధించనున్నారు.15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే 20,000 నుంచి 10,000 రియాల వరకు ఫైన్ వేయనున్నారు. డెలివరీ తర్వాత మొదటి ఆరు వారాల్లో మహిళను పనిలో పెట్టుకుంటే 10,000 రియాలు ఫైన్ వేయాలని తాజాగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







