కోవిడ్ పరిహారం కోసం ఆన్‌లైన్ పోర్టల్
- December 19, 2021
ఏపీ: కోవిడ్‌తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది.ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ప్రక్రియను ఇక ఆన్‌లైన్ చేసేందుకు కోవిడ్ 19 పోర్టల్‌ను తీసుకొచ్చింది.కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా,సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర,రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మొబైల్‌తోపాటు కంప్యూటర్‌లోనూ ఆన్‌లైన్ పోర్టల్‌లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్ నిర్థారించిన ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్‌లైన్‌లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







