బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ పై రాకెట్ దాడి
- December 19, 2021
బాగ్దాద్: బాగ్దాద్ సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయం ఉన్న అల్ట్రా సెక్యూర్ గ్రీన్ జోన్ పై రెండు రాకెట్ తో దాడి జరిగిందని ఇరాక్ భద్రతా దళాలు తెలిపాయి.బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పై రెండు కత్యుషా రాకెట్ల దాడి జరిగంది.తొలుత సి-రాం డిఫెన్స్ బ్యాటరీల ద్వారా గాలిలో కాల్చి వేశారు రెండోది ఒక చతురస్రాకారంలో పడిపోయిందని భద్రతా దళాలు తెలిపాయి.మొదటి రాకెట్ యూఎస్ ఎంబసీ సమీపంలో పడిపోగా, రెండోది 500 మీటర్ల దూరంలో పడిపోయిందని సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి.
గతంలో కూడా యూఎస్ ఎంబసి సమీపంలో రెండు రాకెట్లను కూల్చివేసినట్టుగా భద్రతాధికారులు తెలిపారు.ఈ దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. ఇరాక్‌లో మోహరించిన దాదాపు 2,500 మంది అమెరికన్ సైనికులు వెయ్యి మంది సంకీర్ణ సైనికులు శిక్షణ, సలహాలు ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నారు.ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గాలు దేశంలోని అన్ని యూఎస్ దళాలను విడిచిపెట్టాలనే డిమాండ్ చేస్తున్నాయి.2003లో సద్దాం హుస్సేన్ పై పదవిని కోల్పోయిన తర్వాత ఇరాక్ నుండి అమెరికా దళాలు నిష్క్రమించిన 10వ వార్షికోత్సవం రోజునే ఈ దాడి జరిగింది.
దేశంలోని పెద్ద ప్రాంతాలు ఐసిస్ స్వాధీనం చేసుకొన్న ప్రాంతాలను తిరిగి రాబట్టేందుకు యూఎస్ దళాలు దేశంలోకి ప్రవేశించాయి.ఈ ఏడాది నవంబర్ ప్రారంభంలో ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా ఆల్ కదిమి గ్రీన్ జోన్ లోని అధికారిక నివాసాన్ని లక్ష్యంగా దాడి జరిగింది. ఈ డ్రోన్ బాంబు దాడి నుండి ఆయన క్షేమంగా తప్పించుకొన్నారు.సెప్టెంబర్‌లో ఇరాకీ కుర్ధిస్తాన్ లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని సాయుధ డ్రోన్ దాడి జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు







