బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ
- December 19, 2021
బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నటుడు వీజే సన్నీ నిలిచాడు. బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్ (300sqr) సొంతం చేసుకున్నాడు. సినీతారల సందడితో బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. టాప్-5లో సన్నీతో పాటు షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, సిరి నిలవగా.. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్ విజేతగా సన్నీ అవతరించాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్టైనర్గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్, శ్రీరామచంద్ర ఎలిమినేట్ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు.
తాజా వార్తలు
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్
- శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!







