హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
- December 20, 2021
హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), ఇంధన పొదుపులో చేసిన కృషికిగాను ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ ద్వారా ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2021’ (NECA 2021) అవార్డును అందుకుంది. డిసెంబరు 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి RK సింగ్, GHIAL సీనియర్ అధికారులకు ఈ అవార్డును అందజేశారు.
_1640008367.jpg)
ఎయిర్‌పోర్ట్ రంగంలో ఈ అవార్డు పొందిన ఏకైక విమానాశ్రయం GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ సంవత్సరం, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (NECA) మరియు నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ (NEEEA) లను "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా అందజేసారు.
ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్,‘‘అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలనే మా నిబద్ధతను ఈ విశిష్టమైన గుర్తింపు పునరుద్ఘాటిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా, అత్యుత్తమమైన ఇంధన సంరక్షణ పరిష్కారాలను అన్వేషించడంలో, వాటిని అమలు చేయడంలో GHIAL ఎప్పుడూ ముందుంటుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడానికి మేము అనేక కార్యక్రమాలను ప్రారంభించాము. పర్యావరణ సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్ తరాలు పరిశుభ్రమైన, హరిత సాంకేతికత వైపు మళ్లే దిశగా ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది’’ అన్నారు.
ఇంధన సామర్థ్య పద్ధతులను అవలంబించడంలో ఎప్పుడూ ముందుండే GHIAL, సమర్థవంతమైన ఇంధన నిర్వహణ కార్యక్రమాలకు గుర్తింపు పొందింది. ఇటీవలే GHIAL తమ రెండోదశ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించింది. దీని వల్ల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 50 శాతం ఇంధన అవసరాలు తీరుతున్నాయి. దీని వల్ల దాదాపు 28 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది.ఇది 1.4 లక్షల చెట్లను కాపాడటానికి సమానం.
గత 6 సంవత్సరాలలో, GHIAL కార్యకలాపాలు, ఇంధన సామర్థ్య చర్యల వల్ల సుమారు 15.5 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయింది. ఇది విమానాశ్రయంలో GHG (గ్రీన్ హౌస్ గ్యాస్) ఉద్గారాలను వేగంగా తగ్గించడానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి లెవెల్ 3 + “న్యూట్రాలిటీ” అక్రిడిటేషన్‌ను కలిగి ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, కార్బన్ న్యూట్రల్ ఎయిర్‌పోర్ట్ కూడా కావడం గమనించదగ్గ విషయం.
తాజా వార్తలు
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!
- డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు







