దుబాయ్ ఎక్స్ పో వెళ్లేవారి కోసం అజ్మాన్ నుంచి ఫ్రీ గా 5 కొత్త బస్సులు
- December 21, 2021
దుబాయ్: క్రిస్ మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో ఎక్స్ పో 2020 దుబాయ్‌కి వచ్చే టూరిస్టుల కోసం మరిన్ని ట్రాన్స్ పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (APTA) అజ్మాన్ నగరంలోని ప్రధాన స్టేషన్ నుండి ఎక్స్ పో 2020 దుబాయ్‌కి వచ్చే సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 5 బస్సు సర్వీసులను ప్రారంభించింది. లగ్జరీగా ఉండే ఈ బస్సుల్లో హై స్టాండర్డ్స్ సేప్టీ ప్రమాణాలు ఉన్నాయని APTA పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అండ్ లైసెన్సింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ సమీ అలీ అల్ జల్లాఫ్ తెలిపారు. ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించేందుకు వచ్చే వారికి మెరుగైన ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







