భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
- December 21, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో మొన్నటి వరకు కరోనా డెల్లా వేరియంట్‌తోనే కొట్టుమిట్టాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌తో భయాందోళన గురవుతున్నాయి. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 173కు చేరుకుంది.
ఢిల్లీలో 6, గుజరాత్ 1, కేరళలో 4 చొప్పున గడిచిన 24 గంటల్లో 11 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 28, తెలంగాణలో 20, కర్నాటకలో 19, గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 17, కేరళలో 15, యూపీలో 2లుగా ఉన్నాయి. అయితే ఛత్తీస్‌గడ్, బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదైంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







