ఒమిక్రాన్ ఎఫెక్ట్:డిసెంబర్ 26 నుంచి కొత్త ట్రావెల్ నిబంధనలు
- December 21, 2021
కువైట్: కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు కువైట్ ప్రభుత్వం రెండు కొత్త నిబంధనలను ప్రకటించింది. జనవరి 2 నుంచి కొత్త వ్యాక్సిన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేదంటే వారిని వ్యాక్సిన్ తీసుకోని వారిగా గుర్తిస్తామని కువైట్ హెల్త్ మినిస్ట్రీ తెల్పింది. అదే విధంగా దేశంలోకి వచ్చే ఎవరైనా మూడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కువైట్ వచ్చే 48 గంటల ముందు చేయించుకున్న PCR పరీక్ష నెగిటివ్ రిపోర్టు ఉండాలి. దేశంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా 72 గంటల తర్వాత క్వారంటైన్ నుంచి బయటకు రావాలంటే మరోసారి PCR పరీక్ష చేయించుకోవాలని తెలిపింది. ఈ కొత్త ట్రావెల్ నిబంధనలు డిసెంబర్ 26 (ఆదివారం) నుంచి అమల్లోకి వస్తాయని కువైట్ గవర్నమెంట్ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







