ఒమిక్రాన్ వేగం..ఆ మాస్కులే బెటర్ అంటున్న నిపుణులు
- December 23, 2021
లండన్: దాదాపు రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వాడకం అత్యవసరంగా మారింది. తర్వాత ఆ మాస్కులు కూడా ఫ్యాషన్‌ను ఒంట బట్టించుకున్నాయి.
రకరకాల రంగుల్లో, డిజైన్లతో విరివిగా లభిస్తూ.. ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. డెల్టాకంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో మాస్కుల వాడకంపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. రంగు రంగుల్లో, తిరిగి వినియోగించే మాస్కుల గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిష్ గ్రీన్హాల్గ్ ఈ మాస్కుల వాడకం గురించి పలు విషయాలు వెల్లడించారు.
'ఆ మాస్కులు నిజంగా మంచివి కావొచ్చు లేక భయంకరమైన కావొచ్చు. రెండు మూడు పొరలతో ఉండే క్లాత్ మాస్కులు ప్రభావంతంగా పనిచేస్తాయి. కానీ, వాటి తయారీలో ఫ్యాషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వాటిని అలంకరణ వస్తువుగా చూస్తున్నారు. క్లాత్ మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. వాడే క్లాత్ విషయంలో ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే ఎన్95 మాస్కుల తయారీదారులు మాత్రం .. తమ మాస్కులు 95 శాతం కణాలను వడపోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మాస్కులు పనితీరు ఎంత గొప్పగా ఉన్నా.. ముక్కు, నోటిని వాటితో సరిగా మూయకపోతే అంతా నిష్ర్పయోజనమే. అదే సమయంలో సరిగా శ్వాసతీసుకోవాల్సిన అవసరమూ ఉంది' అని ట్రిష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ వెలుగుచూడటంతో పలు దేశాలు, ప్రభుత్వాలు మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలు విధిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







