భూమి పైకి సౌర తుఫాన్లు వచ్చే ప్రమాదం!
- December 23, 2021
భూమికి మరో ప్రమాదం పొంచి ఉందని అంతరిక్ష నాసా వాతారణ భౌతిక శాస్త్ర వేత్త డాక్టర్ తమిత స్కోవ్ అన్నారు. సూర్యుడి పై జరుగుతున్న పరిస్థితుల కారణంగా సౌర తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇప్పటి పరిస్థితులను చూస్తే రెండు సౌర తుఫాన్లు భూమి వైపు వచ్చే అవకాశం ఉందని తమిత తెలిపారు. ఈ సౌర తుఫానులు అతి త్వరలోనే భూమిని తాకే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే ఈ ఏడాదిలో దాదాపు ఐదు నుంచి ఆరు సౌర తుఫాన్లు భూమి వైపు దూసుకు వచ్చి తాకాయని అన్నారు. కానీ ఇవి చాలా చిన్న సౌర తుఫాన్లు కాబట్టి ప్రమాదం ఎక్కువ సంభవించలేదని అన్నారు.
కానీ రాబోతున్నవి చాలా పెద్ద సౌర తుఫాన్లు అని తెలిపారు. ఒక వేళ ఈ సౌర తుఫాన్లు భూమిని తాకితే రేడియో కమ్యూనికేషన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అలాగే జీపీఎస్ ఆధారంగా నడిచే వ్యవస్థలు అన్నీ కూడా కుప్పకూలి పోతాయని హెచ్చరించారు. అలాగే ఇంటర్నెట్ సౌకర్యానికి అడ్డంకులు ఏర్పాడుతాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పవర్ గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులు కూడా ఏర్పాడుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







