భారత్ కరోనా అప్డేట్
- December 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 7,189 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 387 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,032 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 578 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది.
కాగా నిన్న కరోనా నుంచి 7,286 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,23,263 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,79,520 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 141.01 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







