కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు, కేఫ్‌లపై చర్యలు

- December 25, 2021 , by Maagulf
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు, కేఫ్‌లపై చర్యలు

బహ్రెయిన్: ఎల్లో అలర్ట్ లెవల్ ముందస్తు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు,కేఫ్‌లపై పరిశ్రమ, వాణిజ్యం,పర్యాటక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది.నిబంధనలు పాటించని ఒక రెస్టారెంట్‌ను మూసివేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ,హెల్త్ మినిస్ట్రీ, బహ్రెయిన్ ఎగ్జిబిషన్ అండ్ టూరిజం అథారిటీ (BTEA) సహకారం, సమన్వయంతో నిన్న క్యాపిటల్ గవర్నరేట్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ ఇంటెన్సివ్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లలో భాగంగా హెల్త్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన 28 రెస్టారెంట్లు,కేఫ్‌లకు నోటీసులు అందజేశారు.ఇదే సమయంలో 23 సెలూన్‌లను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా లేని ఇద్దరు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని, నిబంధనలు పాటించని వాటి సమాచారాన్ని తెలపాలని పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com