హౌతీ మిలీషియా రాకెట్ దాడిలో ఇద్దరు సౌదీ పౌరులు మృతి..

- December 25, 2021 , by Maagulf
హౌతీ మిలీషియా రాకెట్ దాడిలో ఇద్దరు సౌదీ పౌరులు మృతి..

సౌదీ అరేబియా: హౌతీ మిలీషియా దాడిలో ఇద్దరు సౌదీ అరేబియా పౌరులు మృతి చెందారు. సౌదీలోని జజాన్ లో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో ఒక సౌదీ, ఒక యెమెన్ వాసి మరణించారని అధికారులు తెలిపారు.ఈ రాకెట్ దాడిలో జజాన్‌లోని సమ్తాహ్‌లోని  వర్క్ షాప్‌, ఓ వాహనం కూడా దెబ్బతింది.యెమెన్‌లోని సాదా నగరం నుండి ఈ రాకెట్ ను ప్రయోగించారని, దాడికి ప్రతిస్పందనగా వైమానిక దాడులు చేసినట్లు యూనైటెడ్ అరబ్ తెలిపింది.ఈ  దాడుల్లో యెమెన్‌లోని అల్-మహ్విత్ గవర్నరేట్‌లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను నిల్వ చేసే నాలుగు డిపోలు,సాదాలో బాలిస్టిక్ క్షిపణులు,ఆయుధాలను నిల్వ చేసే రెండు  గుహలు కూడా ధ్వంసమయ్యాయని యూనైటెడ్ అరబ్ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com