తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు...
- December 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.12 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు.జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలకు,ర్యాలీలకు ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తూ ఇప్పటి కే జీవోను విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణాదిన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.నైట్ కర్ఫ్యూను అమలు చేసే ఆలోచన లేదని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







