ఈ ఏడాది 36,512 డ్రంకెన్ డ్రైవ్ కేసులు: సీపీ స్టీఫెన్ రవీంద్ర
- December 27, 2021
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్‌లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్ అండ్ రన్ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 32 శాతం డ్రంకన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగాయని తెలిపారు.

ఈ ఏడాది మొత్తం 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా… వీటి వల్ల 759 మంది మృతి చెందారన్నారు. మరోవైపు ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై 61.4లక్షల కేసులు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 36,512 డ్రoకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 3,825 మందికి జైలు శిక్ష పడిందన్నారు. తాగి వాహనం నడిపిన 1,356 మంది లైసెన్స్ రద్దు చేశామన్నారు. క్రైం విషయానికి వస్తే ఈ ఏడాది 30,954 కేసులు నమోదయ్యాయని.. నేరస్థులు కొల్లగొట్టిన సొత్తు విలువ రూ.22.32 కోట్లు ఉంటుందన్నారు. ఇందులో రూ.11.74 కోట్లు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది పోలీసులు 53 శాతం రికవరీ చేశారని తెలిపారు.
ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరిగాయని.. గత ఏడాది 1212 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3,854 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 310 చిన్నారులను కాపాడామని పేర్కొన్నారు. 22 బాల్య వివాహాలను షీ టీమ్స్ ఆపాయన్నారు. మహిళలపై నేరాల విషయానికి వస్తే… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయన్నారు.గత ఏడాది 2,572 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,621 కేసులు నమోదు చేశామన్నారు.ఈ ఏడాది 356 రేప్ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై 1.139 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







