ఒమిక్రాన్: ఇజ్రాయిల్ దేశంలో నాలుగో డోసు
- December 27, 2021
జెరూసలేం: ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి.కొన్ని దేశాల్లో రెండో డోసు పంపిణీ చేయడంలో వేగం పెంచాయి. అలాగే మరి కొన్ని దేశాల్లో మూడో డోసు పంపిణీ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.కానీ ఇజ్రాయిల్ దేశ ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి ఏకంగా నాలుగో డోసు పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది.
ఇప్పటికే ఇజ్రాయిల్‌లోని 150 మంది వైద్య సిబ్బందికి ఫైజర్ వ్యాక్సిన్ నాలుగో డోసును అందించింది.అయితే ఇజ్రాయిల్‌లో నాలుగో డోసు తీసుకున్న 150 మంది వైద్య సిబ్బంది ఆరోగ్యంగా ఉండి.. వారు ఓమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగితే దేశ ప్రజలందరికీ సత్వరమే నాలుగో డోసు ఇస్తామని ఇజ్రాయిల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఇజ్రాయల్ దేశంలో ఈ ఏడాది ఆగస్టులోనే మూడో డోసును ప్రజలకు పంపిణీ చేశారు. ఇక నాలుగో డోసు పంపిణీ చేయడానికి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







