'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ వేడుకలో తారక్, చరణ్ ల సందడి..
- December 27, 2021
చెన్నై: ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ డాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఇటీవల ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ ని యాంకర్ ఎన్టీఆర్, చరణ్ ద్వారా తమిళ్ లో అనిపించారు. ఇక ఈ సాంగ్ డాన్ సినిమాలోదని, శివ కార్తికేయన్ హీరో అని చెప్పడంతో చరణ్ , తారక్, శివకార్తికేయన్ కి విషెస్ చెప్పారు. శివ కార్తికేయన్ మైక్ తీసుకొని ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని, మధ్యలో నా సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ తారక్ కి సరిగ్గా సరిపోతాయని.. ఎన్టీఆర్ అంటే ఒక డాన్ .. ఆయన లైఫ్ కు ఆయనే నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







