దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు..

- December 27, 2021 , by Maagulf
దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు..

దుబాయ్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో మహేష్ బాబు తన భార్య పిల్లలతో గడపడానికి గడుపుతున్నాడు.న్యూ ఇయర్ వేడుకలను కూడా దుబాయ్ లోనే తన ఫ్యామిలీతో కలిసి జరుపుకోనున్నాడు.అయితే అక్కడ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను కలిసినట్లు ఓ ఫోటోని మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మహేష్ బాబు తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు.. సెలవుపై దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు అక్కడ భీమ్లా నాయక్ చిత్ర టీమ్ ని కలిశాడు.  మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా గురించి చర్చించేందుకు మహేష్ బాబు కలిసి నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు తన ట్విట్టర్ లో త్రివిక్రమ్, థమన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. . “వర్క్ అండ్ చిల్… టీమ్‌తో మధ్యాహ్నాం సంతోషంగా గడిచింది.అంటూ ఫోటో తోపాటు క్యాప్షన్ ఇచ్చాడు.

భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సంగీత దర్శకుడు SS థమన్ లను ప్రిన్స్ మహేష్ బాబు కలిసిన ఫోటో అభిమానులను అలరిస్తోంది. అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు మూడోసారి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి  నటిస్తున్నాడు.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనుంది.త్వరలో పూజా’ కార్యక్రమం జారుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టీమ్ ప్రొడక్షన్, కాస్టింగ్ పని ప్రారంభించింది.‘సర్కారు వారి పాట’ మూవీకి  ‘గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 2022లో విడుదల కానుంది.మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com