భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం..
- December 31, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు.పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల(డిసెంబర్)28న మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.అతడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం అతడికి చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్‌గా నిర్థరాణ అయినట్లు చెప్పారు.
చనిపోయిన వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని.. నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'బాధితుడు మరణానికి కరోనా కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించింది' అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







