తెలంగాణ: ఒమిక్రాన్, కరోనాపై హైకోర్టులో విచారణ..
- December 31, 2021
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్..ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, ఈ నెల 21, 27తేదీల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ గైడ్ లెన్స్ ను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.. మరోవైపు, కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం..రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక అందజేయాలని ఆదేశించింది.ఇక, ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి