అబుధాబి బిగ్ టికెట్ డ్రా లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- January 02, 2022
యూఏఈ: రియాద్‌లో నివసిస్తున్న భారత ప్రవాసీయుడికి కొత్త ఏడాది బాగా కలిసొచ్చింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. 2022 జనవరి 1న నిర్వహించిన అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో వేఖర్ జఫ్రీ ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారు.ఇంతకుముందు జఫ్రీ పలుమార్లు బిగ్ టికెట్ డ్రాలో పాల్గొన్నప్పటికీ ఆయనకు అదృష్టం వరించలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిసెంబర్ 24న మళ్లీ బిగ్ టికెట్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఆ టికెటే ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం తీసిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో జఫ్రీ కొన్న టికెట్ జాక్‌పాట్ కొట్టింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.2కోట్లు తెచ్చిపెట్టింది. అంతే.. జఫ్రీ బ్యాంకు ఖాతాలోకి రాత్రికి రాత్రే భారీ ప్రైజ్‌మనీ వచ్చి చేరింది.
"ఇప్పటివరకు బిగ్ టికెట్ చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇవాళ నా వంతు వచ్చింది." అని మురిసిపోయారు. బిగ్ టికెట్ హోస్ట్ బౌచ్రా నుంచి తాను 1 మిలియన్ దిర్హమ్స్ గెలిచినట్లు ఫోన్ కాల్ రావడంతో తన ఇంట్లోని వారందరీ ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చారాయన. 2022ను తన జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేనని జఫ్రీ తెలిపారు.ఈ సందర్భంగా బిగ్ టికెట్ నిర్వాహకులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా బిగ్ టికెట్‌ను నిర్వహించడం వల్లే ఎంతో మంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయన్నారు. ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగం చారిటీకి వినియోగించనున్నట్లు జఫ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







