భారత్‌లోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
- January 02, 2022
అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే బెస్ట్ డీజీపీగా నిలిచారు.ఆయన ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ది బెటర్ ఇండియా సంస్థ విడుదల చేసింది. గత రెండేళ్లలో కరోనా కారణంగా ఎదురైన అనేక కఠినమైన సవాళ్లను డీజీపీ సవాంగ్ ఎదుర్కొన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ సవాంగ్ ఉత్తమ సేవలు అందించారని కొనియాడింది.
దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ అందించిన సేవలను ది బెటర్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా ప్రశసించింది.దిశా యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ద్వారా అనేక మంది బాధితులకు సత్వరం రక్షణ కల్పించి అద్భుతాలు సాధించారని తెలిపింది.అత్యుత్తమ టెక్నాలజీతో కేసులను వేగంగా పరిష్కరిస్తూ ఏపీ పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తోందని కొనియాడింది. దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్లోడ్లను చేయడంతో రికార్డు సృష్టించారని పేర్కొంది.కాగా గతంలోనూ జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీ అవార్డును గౌతమ్ సవాంగ్ అందుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







