భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 04, 2022
న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,82,017కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 3,43,06,414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు దేశంలో 1,46,70,18, 464 కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







