ఈ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!

- January 05, 2022 , by Maagulf
ఈ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!

యూఏఈ: మహమ్మారి కరోనా కారణంగా మరోసారి విమాయాన సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి ఇండియా వచ్చేందుకు కేవలం 300 దిర్హమ్స్(సుమారు రూ.6వేలు) ఉంటే చాలు. ఇంతకుముందు వెయ్యి నుంచి 1500 దిర్హమ్స్ ఉన్న చార్జీలు ఇప్పుడు ఏకంగా 4-5 రేట్లు పడిపోయాయి. అలాగే గత వారం రోజులుగా దుబాయ్-భారత్ రూట్‌లో టికెట్ బుకింగ్స్ సైతం భారీగా పడిపోయినట్లు EaseMyTrip అనే ట్రావెల్ పోర్టల్ వెల్లడించింది. వారం ముందు వరకు డైలీ 142 వరకు ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com