కరోనాపై భారత్ కొత్త మార్గదర్శకాలు
- January 05, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదైతే, బుధవారం రోజున 58 వేలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఒక్కరోజులో దాదాపు 20 వేలకు పైగా కేసులు పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు వంటి వాటిని మూసివేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఐసోలేషన్‌ను 10 రోజులకు బదులుగా ఏడు రోజులకు కుదించింది. వరసగా మూడు రోజులపాటు జ్వరం రాకుండా ఉంటే 7 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని కేంద్రం పేర్కొన్నది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం దేశంలో 4.18 శాతంగా ఉంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే సంకేతాలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







