ప్రాణాలతో రాగలిగా.. మీ సీఎంకు కృతజ్ఞతలు: మోదీ ఆగ్రహం
- January 05, 2022
చండీగఢ్: పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా లోపం కారణంగా మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్..
ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. అక్కడ మోదీ అధికారులతో మాట్లాడుతూ.. ''మీ సీఎంకు(పంజాబ్ ముఖ్యమంత్రి) కృతజ్ఞతలు. కనీసం నేను భఠిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా'' అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు.


పంజాబ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ నేడు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కార్యక్రమ వేదికకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే ఉన్న మోదీ.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.


అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. పంజాబ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భద్రతాలోపం తలెత్తిందని ఆరోపించింది. అటు భాజపా నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







