ఒమిక్రాన్‌ను ప్రాబల్య స్ట్రెయిన్‌గా ప్రకటించిన భారత్
- January 05, 2022
న్యూఢిల్లీ : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన నేపధ్యంలో ఈ కరోనా వేరియంట్‌ను భారత ప్రభుత్వం ప్రాబల్య స్ట్రెయిన్‌గా ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్-19 కేసులు అనూహ్యంగా ఎగబాకుతున్నాయి.
దేశంలో పలు నగరాల్లో ఒమిక్రాన్ ప్రాబల్య స్ట్రెయిన్‌గా ప్రబలుతోందని, ఒమిక్రాన్ కట్టడికి ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడటం నివారించాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు.
టాటా ఎండీతో భాగస్వామ్యంతో ఒమిక్రాన్‌ను గుర్తించే ఆర్‌టీపీసీఆర్ కిట్‌ను ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిందని, దీనికి డీసీజీఐ ఆమోదం లభించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడి 108 మరణాలు సంభవించాయని వెల్లడించారు. గత 8 రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగాయని చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న వైరస్ పాజిటివిటీ రేటు కేవలం వారం రోజుల్లో జనవరి 5 నాటికి 5.03 శాతానికి ఎగబాకిందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు పది శాతం పైగా నమోదవుతోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







