మసీదులు, సమూహాల్లో సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన కువైట్
- January 07, 2022
కువైట్: మసీదులు, వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కువైట్‌లో మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌ని అదుపు చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు. మసీదుల్లో ప్రార్థనలు చేసేవారు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తమ సొంత మ్యాట్లను ప్రార్థనల కోసం తీసుురావడం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మసీదు అధికారులు, తలుపులు అలాగే కిటికీలను ప్రార్థనా సమయాల్లో తెరచి వుంచాలని, శుక్రవారం ప్రార్థనలకు 15 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 9 నుంచి కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే వివాహ కాంట్రాక్టు రాత కార్యక్రమాలకు హాజరవ్వాల్సి వుంటుంది. అన్ని బహిరంగ సమూహాలనీ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







