వ్యాట్ ఉల్లంఘనలపై 139 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన ఇండస్ట్రీ మినిస్ట్రీ

- January 07, 2022 , by Maagulf
వ్యాట్ ఉల్లంఘనలపై 139 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన ఇండస్ట్రీ మినిస్ట్రీ

బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం అలాగే నేషనల్ రెవిన్యూ అథారిటీ 139 దుకాణాలు మరియు వ్యాపార సంస్థలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. విలువ ఆధారిత పన్నుకి సంబంధించి ఈ తనిఖీలు జరిగాయి. ఎగ్జిబిషన్ స్ట్రీట్, ఉమ్ అల్ హాస్సమ్, ముహరాక్, ఖామిస్, ఈస్ట్ రిఫ్ఫా, వెస్ట్ రిఫ్ఫా, సిట్రా, అల్ ఆలి కాంప్లెక్స్, మోడా మాల్ ప్రాంతాల్లో దుకాణాల్ని తనిఖీ చేశారు. 98 ఉల్లంఘనల్ని ఈ సందర్భంగా గుర్తించి 10,000 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలు విధించడమే కాకుండా, ఓ దుకాణాన్ని మూసివేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com