'ఒంటెల బ్యూటీ కాంటెస్ట్'లో తొలిసారి పాల్గొన్న మహిళలు

- January 08, 2022 , by Maagulf
\'ఒంటెల బ్యూటీ కాంటెస్ట్\'లో తొలిసారి పాల్గొన్న మహిళలు

రియాద్: సౌదీ అరేబియాలో జరుగుతున్న 'ఒంటెల బ్యూటీ కాంటెస్ట్'లో మొదటిసారిగా ఇరవై ఐదు మంది ఒంటెలు మహిళా ఓనర్లు పాల్గొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఆరవ ఎడిషన్ లో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించారు. ప్రదర్శనల్లో భాగంగా ఒంటెలను న్యాయమూర్తుల కమిటీ వాటి రంగు, జాతి అధారంగా గ్రేడ్ చేస్తుంది. ఈ సంధర్భంగా సౌదీ ఒంటెల మహిళ ఓనర్ మునిరా అల్-ముఖాస్ మాట్లాడుతూ.. ఈపోటీల్లో అవకాశం రావడం పతకాన్ని గెలుచుకున్నంత ఆనందంగా ఉందన్నారు. చాలా ఎండ్లుగా ఒంటెలు కాంటెస్ట్ లో పాల్గొనాలని చూశాను. ఇప్పుడు నా కోరిక తీరిందని చెప్పింది. ఫెస్టివల్లో తన ఒంటె విలువ దాదాపు SR1 మిలియన్ ($266,000) ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే ఈవెంట్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సౌదీ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఒంటెల కన్సల్టెంట్, సభ్యుడు ఫహద్ అల్-బోగామి మాట్లాడుతూ.. అనేక షేడ్స్ ఒంటెలు పోటీల్లో పాల్గొన్నాయని, వాటి తల, మెడ, మూపురం వంటి వాటితో పాటు పరిమాణం, పొడవు, ఎత్తును పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ చేస్తామన్నారు. రియాద్కు ఈశాన్యంలో నిర్వహించే కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల ఫెస్టివల్ కు ప్రతిరోజూ 100,000 మంది సందర్శకులు వివిధ దేశాల నుంచి వస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com