‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..

- January 09, 2022 , by Maagulf
‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..

హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హీరో’ ఈ సంక్రాంతి సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ రాబోతోంది.. ప్రమోషన్‌ స్పీడ్‌ పెంచిన చిత్ర యూనిట్‌ ఇవాళ తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. కానీ, సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్‌ బాబు కన్నుమూసిన నేపథ్యంలో.. ఇవాళ తిరుపతిలో జరగాల్సిన ‘హీరో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు..

మాజీమంత్రి గల్లా అరుణకుమారి మనవడు, ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడైన గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’.. గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com