యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు

- January 09, 2022 , by Maagulf
యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు

యూఏఈ: ఇండియా వెళ్ళే ప్యాసింజర్స్ కు జనవరి 11 నుండి 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎనిమిదో రోజున ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. Omicron వేరియంట్ ప్రాబల్యం కారణంగా ఇండియా కు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రిత్వ శాఖ నియమాలను అప్డేట్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య ట్రావెల్ పై ప్రభావం చూపనుంది. UAE నుండి వెళ్ళే ప్రయాణికులందరూ RT-PCR పరీక్ష చేయించుకోనవసరం లేదు. వారు ప్రయాణించే రాష్ట్రాన్ని బట్టి, ఎంపిక చేయబడిన ప్రయాణీకులలో రెండు శాతం మందికి విమానాశ్రయంలో పరీక్షలు చేస్తారు. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రయాణీకులందరికి పరీక్షలు తప్పనిసరి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com