ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం..

- January 09, 2022 , by Maagulf
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం..

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 22 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 4821 మంది మృతి చెందారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ తరువాత భారత్ లోనే అధికంగా కరోనా కొత్త కేసులు, మరణాలు సంభవించాయి.

అమెరికాలో కొత్తగా 4,68,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 669 మంది మృతి చెందారు. ఫ్రాన్స్​లో కొత్తగా 3,03,669 లక్షల కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కరోనా బారిన పడి 142 మంది మృతి చెందారు. బ్రిటన్ లో కొత్తగా 1,46,390 కేసులు, 313 మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీలో కొత్తగా 1,97,552 కరోనా కేసులు నమోదు కాగా, 184 మంది మృతి చెందారు.

భారత్ లో కొత్తగా 1,59,632 కరోనా కేసులు, 327 మరణాలు సంభవించాయి. ఆస్ట్రేలియాలో కొత్తగా 1,15,507 కేసులు నమోదవ్వగా, 25 మంది మృతి చెందారు. అర్జెంటీనాలో ఒక్కరోజే 1,01,689 కేసులు, 37 మంది మృతి చెందారు. టర్కీలో కొత్తగా 68,237 కేసులు నమోదు కాగా, 141 మంది మరణించారు.

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో మరోసారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 327 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 12 శాతం కోవిడ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు 3,55,28,004 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,83,790 మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 41,434 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 18,802, ఢిల్లీలో 20,181, తమిళనాడులో 10,978, కర్ణాటకలో 8906 కేసులు, కేరళలో 5944 నమోదు అయ్యాయి.

మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3,623 కు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ నుంచి 1409 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com