రైస్‌లెస్ చికెన్ బిర్యానీ...
- January 09, 2022
బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. బిర్యానీని ఎన్ని రకాలుగా తయారు చేసినా లొట్టలేసుకుని మరీ ఆరగిస్తాం. ఇంకా ఎందుకు ఆలస్యం, రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..
కావాల్సిన పదార్థాలు:
చికెన్– 300 గ్రాములు; సేమియా– ఒక కప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు– ఒక స్పూన్ ; నల్లమిరియాలు– ఒక స్పూన్ ; దాల్చిన చెక్క ముక్క– మీడియం సైజు ఒకటి; యాలకులు– ఆరు; లవంగాలు– రెండు; సోంపు– అర స్పూన్ ; నెయ్యి– రెండు స్పూన్లు; ఆయిల్– ఒక స్పూను; షాజిరా– అరస్పూన్ ; నల్ల జీలకర్ర– అర స్పూన్ ; బిర్యానీ ఆకు–ఒకటి; అనాస పువ్వు– ఒకటి; పచ్చిమిర్చి–మూడు; పుదీన– చిన్న కట్ట; ఉల్లిపాయలు– సన్నగా తరిగిన కప్పు ఉల్లి తరుగు; ఉప్పు– రుచికి సరిపడినంత; పసుపు– పావు స్పూన్ ; దనియాల పొడి– అర స్పూన్ ; కారం– అర స్పూన్ ; టమోట– ఒకటి; నీళ్లు – రెండు కప్పులు.
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో వేసి పొడిలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- తరువాత బిరియానీ ఉడికేందుకు సరిపడా మరో పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక సేమియాను వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్‌లో ఒక స్పూన్ నూనె, మిగిలిన నెయ్యి వేసి కాగిన తరువాత దానిలో నల్ల జీలకర్ర, బిర్యానీ ఆకు, చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ తరుగు వేసి మగ్గనివ్వాలి. కాసేపయ్యాక ఈ పాన్‌లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, దనియాల పొడి, కారం, గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- పదినిమిషాలయ్యాక విత్తనాలు తీసేసి సన్నగా తరిగిన టమోట ముక్కలను వేయాలి. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసి రెండు కప్పులు నీళ్లు పోయాలి. రెండు నిమిషాలు మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి మరికాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు, సేమియా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పాన్‌ను ఐదు నిమిషాలపాటు అలాగే స్టవ్ మీద ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. చాలా త్వరగా సింపుల్‌గా తయారయ్యే రైస్‌లెస్ చికెన్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!