ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
- January 09, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 38, 479శాంపిల్స్ పరీక్షించారు. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి దాకా 3,16,05,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 20,78, 964 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా 20, 59, 685 మంది వైరస్‌ను జయించారు. మొత్తం 14505 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







