ఓమిక్రాన్ మరో లక్షణం...కాళ్లలో తీవ్రమైన నొప్పి
- January 11, 2022
బెంగళూరు: ప్రపంచం అంతటా ఓమిక్రాన్ చుట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నాయి.
తాజాగా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మరో వైద్యుడు లక్షణాల్లో మార్పును ధృవీకరించారు. "ఒక వ్యక్తికి పాజిటివ్ పరీక్షలు వచ్చినప్పుడు అలసటతో పాటు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది సాధారణంగా ప్రాథమిక లక్షణాలుగా పరిగణిస్తాం. అయితే, ఈమధ్యన ఓమిక్రాన్ వచ్చిన పీజీ మెడికల్ విద్యార్థిని భూమిక పవార్, తనకు కాలునొప్పి ఎక్కువైందని తెలియజేయటం జరిగింది”అని డాక్టర్ బాను చెప్పారు.
"ఇది తొడ నుండి కాలి వరకు వ్యాపించింది. మొదట్లో అది ఎడమ కాలులో అనిపించినా తర్వాత రెండు కాళ్లు కూడా నొప్పి గా ఉన్నట్టు పవార్ చెప్పారు.
మరో వ్యక్తి మాటల్లో.. జనవరి 3న రాజాజీనగర్‌లోని స్నేహితుడి స్థలంలో న్యూ ఇయర్ పార్టీ హాజరైన తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన చంద్రకాంత్ గౌడ ఇలా అన్నాడు: “గొంతు దురద కారణంగా నేను మింగలేకపోయాను. నాకు జ్వరం, జలుబు లేదు. మూడవ రోజు, నాకు కాలు నొప్పి వచ్చింది, ఇది నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించనిది, కానీ అది ఒక రోజులో తగ్గింది”అని గౌడ చెప్పారు.
గొంతు నొప్పితో బాధపడేవారు బెటాడిన్‌తో పుక్కిలించాలని మరియు కాలు నొప్పికి పారాసెటమాల్ (డోలో-650) తీసుకోవాలని డాక్టర్ బాను సూచించారు. లక్షణాలు మరింత తీవ్రమైతే, ఆసుపత్రిలో చేరడం మంచిది అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి