నైట్ కర్ఫ్యూ నిబంధనలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- January 11, 2022
అమరావతి: కరోనా నియంత్రణలో భాగంగా నైట్ కర్ఫ్యూకు రంగం సిద్ధం చేస్తున్న ఏపీ భుత్వం. దానికి సంబంధించిన నిబంధనలు విడుదల చేసింది. నెలాఖరు వరకు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇవ్వనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్లో 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. మాస్కు లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం. మాస్కులేని వారిని దుకాణాలు, షాపుల్లోకి అనుమతిస్తే ఓనర్లకు 25వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతర్రాష్ట్ర రవాణాకు ప్రభుత్వం అనుమతించింది. ప్రజా రవాణాలో ప్రయాణికులకు, సిబ్బందికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మాస్క్ లేకుంటే 100 రూపాయల ఫైన్ వేయనున్నారు. కరోనా రూపంలో సినిమా ఇండస్ట్రీపై మరో దెబ్బ పడింది. నిబంధనల్లో భాగంగా 50శాతం సామర్థ్యంతోనే సినిమా థియేటర్లు నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రార్థన మందిరాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి