త్వరలో 'తొలి కిరణం' చిత్రం ఆడియో విడుదల
- March 26, 2016ఏసుక్రీస్తు జీవితం మళ్లీ తెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది. పీడి రాజు ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'. ఆర్ .పి.పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.దర్శకుడు మాట్లాడుతూ- ''ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ వేడుక కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నిర్మించాం.
వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, ఎడిటింగ్: వినయ్.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







